Site icon HashtagU Telugu

Chandrababu : తెలంగాణ‌లో చంద్ర‌బాబుకు పెరుగుతున్న మ‌ద్ధ‌తు.. మ‌రి ఏపీలో..?

Chandrababu

CM Jagan Master Plan For Chandrababu Arrest

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌రువాత ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మ‌రితం మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆయ‌న అభివృద్ధి చేశారు. తాజాగా ఆయ‌న అరెస్ట్‌పై ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ఎక్కువ మంది ఖండిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడికి తెలంగాణ‌లో భారీగా మ‌ద్ధ‌తు ల‌భిస్తుంది. ఐటీ కారిడార్‌తో పాటు కూక‌ట్‌ప‌ల్లి స‌హా వివిధ ప్రాంతాల్లో ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ఆందోళ‌న చేశారు. ఖ‌మ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చంద్ర‌బాబు అభిమానులు ఆందోళ‌న చేస్తున్నారు. స‌త్తుప‌ల్లిలో చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయ‌న అభిమానులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆదివారం ఖ‌మ్మంలో భారీ ర్యాలీని నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బాబుకి మద్ధ‌తు పెరుగుత‌న్న‌ప్ప‌టికి ఏపీలో మాత్రం తూతూమంత్రంగా నాయ‌కులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఐదేళ్ల కాలంగా అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప‌ని చేసిన వారు సైతం బాబు అరెస్ట్‌పై నామ‌మాత్రంగానే ఆందోళ‌న చేశారు. ఏపీలో టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, ఐటీ ఉద్యోగుల‌ను చూసి ఏపీ టీడీపీ నేత‌లు సిగ్గుప‌డాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికి కూడా ఏపీ టీడీపీ నేత‌లు బ‌య‌టికి రాకూండా షో చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు జైల్లో ఉంటే ఏపీలో టీడీపీ నేత‌లు మాత్రం త‌మ వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ.. అప్పుడ‌ప్పుడూ నిర‌స‌న దీక్ష‌లో ఫోటోలు తీసుకుని షో చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైన ఏపీ టీడీపీ నేత‌ల తీరుమారాల‌ని సొంత పార్టీ క్యాడ‌ర్ కోరుకుంటుంది.