తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) నేపథ్యంలో అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Election Polling) జరగనుంది. ఐదేళ్ల ఒక్కసారి వచ్చే ఎన్నికలు కావడం..మనల్ని పాలించే డిసైడ్ చేసే ఎన్నికలు కావడం తో ప్రతి ఒక్కరు తమ ఓటును వియోగించుకోవాలని సొంతర్లకు బయలుదేరారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం స్కూల్స్ , కాలేజీలకు , పలు ఆఫీస్ లకు సెలవులు ప్రకటించడం తో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేసేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని MGBS, JBS బస్‌స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సరిపడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్రయాణికులు బస్సు సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా భారీ సంఖ్యలో ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో స్టేషన్ మొత్తం ప్రయాణికులతో సందడి సందడిగా మారింది.
ఈసారి తెలంగాణ ఎన్నికల పోరు గట్టిగా ఉండబోతుంది.. ఈ ఎన్నికలఫై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS) పార్టీ కి మరో ఛాన్స్ ఇస్తారా..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ కి జై కొడతారా..? కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP) ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా..? అనేది తెలుసుకోవాలని ఆసక్తి గా ఉన్నారు. 119 నియోజకవర్గాలకు సంబదించిన పోలింగ్ రేపు పూర్తి అవుతుంది..డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి.