Site icon HashtagU Telugu

Prajavani : ప్రజావాణికి విశేష స్పందన..తెల్లవారుజాము నుంచే భారీ క్యూలైన్లు

Huge Response To Prajavani

Huge Response To Prajavani

తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తీసుకొచ్చిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకుంటామని ప్రభుత్వం తెలుపడం తో ఈరోజు తెల్లవారుజాము ప్రజలు భారీ సంఖ్యలో ప్రజాభవన్ కు చేరుకొని తమ ఫిర్యాదులను అధికారులకు అందజేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం (BRS Govt)లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి… అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు జనం. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ వనతిపత్రాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కొద్దీ సేపటి క్రితం నుండి ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ప్రజావాణి కార్యక్రమం కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏర్పటు చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. తమ సమస్యలు చెప్పుకోవాలంటే హైదరాబాద్ కు రావాల్సి వస్తుందని..అంత దూరం నుండి వచ్చి సమస్యలు చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నామని..అందుకే ప్రజల సమస్యలకు… ఆయా నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం చూపితే..బాగుంటుందని కోరుకుంటున్నారు.

మరోపక్క ప్రజాభవన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తొలుత దరఖాస్తులు స్వీకరించి అసెంబ్లీకి బయలుదేరినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. జివికె వన్, వెంగల్ రావు పార్క్, ఎన్‌ఎఫ్‌సిఎల్, పంజాగుట్ట ఎక్స్ రోడ్స్, సోమాజిగూడ సర్కిల్ నుండి ప్రజా దర్బార్ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాయి.

Read Also : Governor Tamilisai Speech in Assembly : గవర్నర్‌ తమిళసై ప్రసంగం ఫై ఉత్కంఠ..