Fire Accident: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతులు

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7గురు మరణించారు. 

  • Written By:
  • Updated On - September 13, 2022 / 12:22 PM IST

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది మరణించారు.  ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో సోమవారం రాత్రి సంభవించిన ఘోరఅగ్నిప్రమాదంలో ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి దానిపైన ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో లాడ్జిలోని పర్యాటకులు ఊపిరాడక ఎక్కడిక్కడ పడిపోయారు. ఈ ఘటనలో 4 గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరిలో 6గురు పురుషులు ఓ మహిళ ఉన్నారు. వీరి వయస్సు 35 నుంచి 40సంవత్సరాలు ఉంటారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో విజయవాడకు చెందిన ఎ హరీశ్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్లు గుర్తిచంారు. మిగతావారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

పాస్ పోర్టు కార్యాలయానికి సమీపంలోని ఓ 5 అంతస్తుల భవనం ఉంది. ఇందులో 4వ అంతస్తుల్లో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ , సెల్లార్ లో రూబీ ఎలక్ట్రిక్ షోరూమును ఉంది. గత రాత్రి 9 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో వాహనాల్లోని బ్యాటరీల్లో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలాయి. దీంతో వాహనాలు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. ఆపై పై అంతస్తులకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలున అదుపు చేశారు. మరోవైపు మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక పర్యాటకులు భయంతో అరిచారు. రక్షించమని కేకలువేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారి ఆందోళన ఎక్కువైంది. తప్పించుకునే మార్గం లేక ఊపిరాడక మరణించారు. సమాచారం అందుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.