Site icon HashtagU Telugu

Telangana Flood Relief Fund : వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..

Huge Donations To Cmrf For

Huge Donations To Cmrf For

Huge Donations to CMRF for Flood Victims : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల (Heavy Rains and Floods) వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. పలుచోట్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో వరద బాధితుల కోసం తమ వంతు సాయం అందజేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చి వివరాల చెక్ లను అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి (CM Relief Fund) రూ.20లక్షల విరాళాన్ని టెక్నో పెయింట్స్ వారు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ చెక్ ను అందజేశారు. అలాగే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్‌ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి గారు, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని గారు, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి గారు MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.

నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర శరణి ,ఈడీ పునీత్ లు వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.5 కోట్ల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ వై.శోభ వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల చెక్కు ను అందజేశారు. శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ చక్రవర్తి రూ. 25 లక్షలు, Moldtek Industries వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ కోటి రూపాయిల చెక్ ను అందజేశారు.

Read Also : Asaduddin Owaisi : ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయి