RGIA : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ క‌రెన్సీ స్వాధీనం

హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారం, విదేశీ క‌రెన్సీని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 01:43 PM IST

హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారం, విదేశీ క‌రెన్సీని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3.734 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. దీని విలువ రూ. 2.19 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. అదే స‌మ‌యంలో విదేశీ కరెన్సీని కూడా క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ.16.46 లక్షలుగా ఉంది. అక్టోబరు 4, 5 తేదీల్లో జరిగిన త‌నిఖీల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 4 న దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి అనుమానంతో త‌నిఖీ చేయ‌గా..724 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. మరో కేసులో దుబాయ్ నుండి అక్టోబర్ 4న కూడా వచ్చిన ఒక ప్రయాణికుడిని త‌నిఖీ చేయ‌గా పేస్ట్ రూపంలో ఉన్న 214 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. అక్టోబరు 5న షార్జా నుండి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 1220 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం త‌నిఖీల్లో 3.734 కిలోల స్మగ్లింగ్ బంగారం విలువ రూ. 2.19 కోట్ల లక్షలు మరియు విదేశీ కరెన్సీ విలువ రూ. 16,46 లక్షలుగా అధికారులు గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.