ఎన్నికల వేళ (Election Code)..హైదరాబాద్ లో భారీగా నగదు లభ్యమైంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుంటాయి కాబట్టి…ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని దారుస్సలాం ఔట్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది.
We’re now on WhatsApp. Click to Join.
మంగళ్‌హాట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్త రవిచంద్ర, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా ములుకలపల్లి చెక్ పోస్ట్ వద్ద వేర్వేరు సోదాల్లో రూ. 8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా ఓ రూ.4.50 లక్షల నగదు పట్టుబడగా, మరో వాహనంలో రూ.3.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.6.40 లక్షలు పట్టుబడ్డాయి.
ఏపీలోనూ పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికలు గట్టిగా ఉండబోతుండడం తో పెద్ద ఎత్తున నగదు చేతులు మారే అవకాశం ఉండడం తో పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
Read Also : Vistara : విస్తారాలో సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా