Site icon HashtagU Telugu

HRC : సికింద్రాబాద్ ఘటనలపై స్పందించిన మానవహక్కుల కమిషన్..!!

Agnipath1

Agnipath1

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ (HRC)స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది హెచ్ఆర్సీ. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ RPF, GRP, GDPలను ఆదేశించింది. నివేదిక అందించేందుకు జులై 20వ తేదీని తుది గడువుగా నిర్దేశించింది.

కాగా శుక్రవారం సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్మీలో నియామకాల కోసం తీసుకువస్తున్న అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు రైళ్లను ద్వంసం చేసి నిప్పు పెట్టారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు ఆందోళనకారులు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14మంది గాయపడ్డారు. వారిలో దామెర రాకేశ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలినవారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version