Site icon HashtagU Telugu

Formula E Car Race Case : అధికారం ఉందని అరెస్ట్ చేస్తే ఎలా..? – జేడీ

Jd Ktr

Jd Ktr

ఫార్ములా-ఈ కార్ రేసు కేసు (Formula E Car Race Case) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యహారంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ను అరెస్ట్ చేయబోతున్నారని..జైల్లో వేస్తారని..కొన్ని నెలల పాటు ఆయన జైల్లోనే ఉంటారని , కనీసం బెయిల్ కూడా రాదని ఇలా ఎవరికీ వారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (Former CBI JD Lakshmi Narayana) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాయి. “అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదు” అని ఆయన స్పష్టం చేశారు.

లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. “అరెస్ట్ అనేది సమాజంపై వ్యక్తి విలువను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి” అని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. అనవసరంగా, కారణం లేకుండా అరెస్టులు చేయడం అనైతికమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకుంటే, ఆ కారణాలను కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. ఆరెస్ట్ చేయడం వెనుక ఉన్న అవసరాన్ని క్షుణ్ణంగా సబ్జెక్ట్ చేయాలి అంతే కానీ ఎవరి పడితే వారిని అరెస్ట్ చేస్తాం అంటే కుదరదని చట్టం అన్ని చూస్తాడని చెప్పుకొచ్చారు.

ఇక ఈ-కార్ రేసు కేసు(Formula E Race Case)లో KTR కు హైకోర్టు కీలక (BIg Relief) ఊరటనిచ్చింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. కేటీఆర్ తరుపున లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. కేసు కొట్టేయాలని సుందరం, వద్దని సుదర్శన్ కోరారు. ఇరు వాదనలు విన్న కోర్ట్ కేటీఆర్ ను 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Pawan Kalyan : I Love U అంటూ మన్యం ప్రజల్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్..