KTR: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు: కేటీఆర్

  • Written By:
  • Updated On - March 15, 2024 / 06:50 PM IST

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐటీ అధికారుల పైన కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తోంది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.