Site icon HashtagU Telugu

Kavitha – Elections : కవిత అరెస్ట్.. బీఆర్ఎస్‌కు ప్లస్సా ? మైనస్సా ?

Kavitha Elections

Kavitha Elections

Kavitha – Elections : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్  చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎట్టకేలకు అదే జరిగింది. కవితను ఈడీ అరెస్టు చేసింది. అది కూడా అకస్మాత్తుగా !! దీంతో బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎవరూ కవిత ఇంటి వద్దకు రాలేదు. కేటీఆర్, హరీష్ రావు  మాత్రమే వచ్చారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకునేలోపే కవితను ఢిల్లీకి ఈడీ అధికారులు తీసుకెళ్లారు. ఇంతకీ కవిత అరెస్టు ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికల రాజకీయాలపై పడుతుందా ? బీఆర్ఎస్‌కు సానుభూతి ఓట్లు పడతాయా ? ఓ పరిశీలన..

We’re now on WhatsApp. Click to Join

ఆ కుట్రలో భాగమే.. కవిత అరెస్ట్ : సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. కవిత అరెస్టు వ్యవహారంలో భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించాల్సిందే అని ఆయన కామెంట్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగానే  ఆమె అరెస్టు జరిగిందని చెప్పారు. కవిత అరెస్టుపై  కేసీఆర్ కానీ.. తెలంగాణ పర్యటనలో ఉన్న మోడీ కానీ స్పందించలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఈ డ్రామాలను తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు ఈ  నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు.

Also Read :Exams Vs Election Dates : ఎన్నికల తేదీల్లో ఎన్నో ‘పరీక్షలు’.. విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన

సానుభూతి అస్త్రం ప్రయోగిస్తారా ?  

కవిత అరెస్టుతో బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికల్లో(Kavitha – Elections) సానుభూతి ఓట్లు పడతాయనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్  సీనియర్ నేతలంతా  ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు లేరు. ఇలాంటి సమయంలో కవిత అరెస్టు రూపంలో సానుభూతి ఓట్లను పొందే అవకాశం బీఆర్ఎస్ లభించిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ఫ్యామిలీని కేసులతో ఇబ్బంది పెడుతున్నారనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తే కారు పార్టీకి మంచి ఫలితాలే వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ కేసీఆర్ ఎన్నడూ సానుభూతి ఓట్ల కోసం పాకులాడలేదు. ఆయన ఉద్యమ పంథాను మాత్రమే నమ్ముకున్నారు. తనపై జాలి చూపాలని ఆయన ప్రజల్ని కోరే ఛాన్సే లేదు.అందుకే ఇప్పుడు కేసీఆర్  మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. కవిత కోసం తెర వెనుక రాజకీయాలు చేయడంపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారని చెబుతున్నారు. కవిత అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొనేందుకే గులాబీ బాస్ మొగ్గుచూపుతారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతలా వేధిస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ ఫ్యూచర్‌లోనూ చేరువయ్యే అవకాశాలు ఉండవని తేల్చి చెబుతున్నారు.

Also Read :Lok Sabha Election 2024: ఈసారి 7 దశల్లో ఎన్నికలు.. 2014, 2019లో ఎన్ని ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రిగిందంటే..?