Site icon HashtagU Telugu

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇప్పటివరకు ఎంత చెల్లించిందో తెలుసా..?

Indiramma Houses

Indiramma Houses

తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకాన్ని వేగవంతం చేసింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.30 కోట్లను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 2.15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. వీటిలో 1.29 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పేదలకు స్వంత ఇల్లు అనే కలను నిజం చేయడమే కాకుండా, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం కూడా పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Roads and Bridge Development : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద ప్రజలకు ఒకవైపు గృహ భద్రత కలుగుతుంటే, మరోవైపు నిర్మాణ రంగంలో పనులు లభించి కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పథకం అమలు వల్ల సమాజంలోని వెనుకబడిన వర్గాలు శాశ్వత నివాసం పొందడం ద్వారా గౌరవప్రదమైన జీవన విధానం సాధించగలుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.