హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate) రంగంలో ఇటీవల భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు 20 అంతస్తుల భవనాలను (20 floor building) కనిపించగా, ఇప్పుడు 60 అంతస్తుల (60 floor building) వరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఇలాంటి భారీ నిర్మాణాలు ఎక్కడికక్కడ పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో ఎన్ని అంతస్తుల వరకూ కట్టేందుకు అనుమతి లభిస్తుందో అనే సందేహం చాలామందిలో నెలకొంది. సాధారణ ఇండిపెండెంట్ హౌస్‌లకు G+2 వరకు మాత్రమే అనుమతిస్తారు.
Lokesh : పీఏ కుమార్తె నిశ్చితార్థ వేడుక సతీసమేతంగా వెళ్లిన నారా లోకేష్
2006లో విడుదలైన GO 86 ప్రకారం హైదరాబాద్‌లో ఎత్తైన భవనాలకు ఎలాంటి పరిమితి లేదు. ఈ GO ప్రకారం.. స్థలం ముందు ఉన్న రోడ్డు వెడల్పును ఆధారంగా చేసుకుని నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. 100 అడుగులు లేదా అంతకంటే వెడల్పైన రహదారులపై నిర్మించే భవనాలకు ఎత్తు పరిమితి ఉండదు. ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ల వెంబడి ఈ భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇదే కారణంగా గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట్, నానక్‌రాంగూడ వంటి ఐటీ హబ్ ప్రాంతాల్లో స్కైస్క్రాపర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఎత్తైన భవనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం మరింత అనుమతులను మంజూరు చేస్తే 2026-27లో హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనాలు నిర్మితమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది కొత్త స్కైస్క్రాపర్ల రికార్డులు సృష్టించే అవకాశముందని, ప్రధానంగా గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, టెలాపూర్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేస్తున్నారు.