Private Hospitals Bills: ‘ప్రైవేట్’ దోపిడి.. 10 రోజుల ట్రీట్ మెంట్ కు  54 లక్షల బిల్లు!

మనుషుల అవసరాలను ఆసరాగా చేసుకొని పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Im 222481 Logo Imresizer

hospital bed

తెలంగాణలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు (Private Hospitals) ధనర్జానే ధ్యేయంగా రోగులను పట్టిపీడిస్తున్నాయి. చిన్న చిన్న రోగాలకే లక్షల్లో డబ్బులను గుంజుతున్నాయి. మనుషుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad) పలు ఆసుపత్రులు రోగుల నుంచి విపరీతంగా వసూలు చేస్తున్న మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో 10 రోజుల  (Ten Days) చికిత్స కోసం సయ్యద్ రహ్మత్ ఉద్దీన్ అనే రోగి నుంచి 54 లక్షలు వసూలు చేశారు. రోగి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు రూ. 20 లక్షలు చెల్లించారని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఆసుపత్రి ఇంకా రూ. 29 లక్షలు డిమాండ్ చేస్తుందని పేర్కొన్న ఖాన్, రోగిని గాంధీ లేదా నిమ్స్ ఆసుపత్రికి (Hospital) తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అభ్యర్థించారు. రోగిని తరలించడానికి ఆసుపత్రి నిర్వాహకులు రూ. 29 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, ఇది చాలా ఎక్కువ. ఈ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని తనిఖీ చేయడానికి ఏదైనా ఏజెన్సీ ఉందా, సంబంధిత వ్యక్తులు 8897184626 ను సంప్రదించి రోగిని గాంధీ లేదా నిమ్స్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

ఇంతకుముందు కూడా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులలో (Private Hospitals) కొందరు COVID చికిత్స పేరుతో లక్షల్లో డబ్బులను దండుకున్నాయి. అయితే తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 44 ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ చికిత్స సమయంలో ఎక్కువ వసూలు చేసిన రోగులకు డబ్బును (Money) వాపసు చేయాల్సిందిగా కోరింది. వాటిలో నాలుగు ఆసుపత్రులు మాత్రమే ఒక్కొక్కటి 10 లక్షలకు పైగా తిరిగి ఇచ్చాయి. RTI ప్రత్యుత్తరం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 22, 2021 నాటికి రోగులకు మొత్తం రూ.1,61,22,484 తిరిగి ఇవ్వబడింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. సాధారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో (Private Hospitals) చికిత్స పొందేందుకు ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, సక్రమంగా అందడం లేదు.

Also Read: Shahrukh and Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌.. ఎందుకో తెలుసా!

  Last Updated: 23 Jan 2023, 12:41 PM IST