Site icon HashtagU Telugu

Peddapalli : పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య

Paruvu Hatya

Paruvu Hatya

పెద్దపల్లి (Peddapalli ) జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పురితోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించడాన్ని ఆమె తండ్రి సహించలేకపోయాడు. కూతురును ప్రేమించొద్దని పలుమార్లు హెచ్చరించినా అతడు పట్టించుకోలేదని ఆగ్రహించిన తండ్రి, సాయికుమార్‌పై దాడి చేశాడు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

UAE President Mohamed: 500 మంది భార‌తీయ‌ ఖైదీలను విడుదల చేసేందుకు UAE ప్రధాని ఆదేశం

నిన్న రాత్రి సాయికుమార్ తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో యువతి తండ్రి, గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇలాంటి పరువు హత్యలు సమాజంలో మరణముద్ర వేస్తున్నాయి. ప్రేమను అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులు, పెళ్లిళ్లు పరువు కోసం కాదు, మనుషుల ఆనందం కోసం అని తెలుసుకోవాలి. ఈ సంఘటన ద్వారా మరింత అవగాహన పెంచి, ప్రేమజంటల హక్కులను కాపాడే విధంగా సమాజం మారాలి. కేవలం కుటుంబ గౌరవం కాపాడాలనే భావనతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతమాత్రం న్యాయం కాదు. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.