Site icon HashtagU Telugu

Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!

Amit Shah

Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ షాను రిసీవ్ చేసుకొని స్వాగతం పలికారు. ఆ తర్వాత ముచ్చింతల్ కు వెళ్లారు. ఆశ్రమంలోని సమానత్వ విగ్రహాన్ని హోంమంత్రి సందర్శించారు. ఆశ్రమంలో నిర్మించిన 108 దివ్యదేశం (ఆలయాలు) కూడా సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన యాగాల్లో అమిత్ షా కూడా పాల్గొన్నారు.

“ప్రాణులన్నీ సమానమే అన్నది రామానుజాచార్యుల జీవిత సందేశం. అతను వేదాలలోని ప్రాథమిక వాక్యాన్ని తీసుకున్నారు. ఎవరితోనూ కటువుగా మాట్లాడకుండా తన చర్యల ద్వారా ఎవరినీ నొప్పించకుండా అనేక సంప్రదాయాలను కొనసాగించారని ”అని అమిత్ షా అన్నారు. ఈ సమానత్వ విగ్రహం దూరం నుండి అద్భుతంగా కనిపిస్తోందని హోంమంత్రి అన్నారు. రామానుజాచార్యులు దేశంలో సనాతన ధర్మాన్ని పెంపొందించి, యావత్ ప్రపంచానికి సమానత్వ సందేశాన్ని అందించారన్నారు. సమానత్వ విగ్రహం ఆత్మకు శాంతి చేకూరుస్తుందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దండి స్వామీజీల పాద కమలం నుంచి సమానత్వ విగ్రహం ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమైందన్నారు.