Political Twist: జూ.ఎన్టీఆర్, అమిత్ షా భేటి, పొలిటికల్ ట్విస్ట్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్.

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 01:09 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్. ప్రత్యేకించి టీడీపీలో కలకలం మునుగోడులో సభలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా తో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నారు. బీజేపీ నేతలు ఈ మేరకు అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఖారారు చేసారు. శనివారం రాత్రికి ఒక ప్రముఖ హోటలో అమిత్ షాతో జూనియర్ ను విందుకు ఆహ్వానించారు. ఆ మేరకు బీజేపీ నేతలు ఈ ఆహ్వానాన్ని నిర్దారించారు.
షా తో భేటీ వెనుక రహస్యం మాత్రం తెలియటం లేదు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే విషయం లో తమ అభిప్రాయం స్పష్టం చేయటం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమిత్ షా తో కలిసి విందులో పాల్గొనటం రాజకీయంగా ప్రకంపనాలను సృష్టిస్తోంది.
అటు ఏపీలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ ఇటు నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పుడు నేరుగా అమిత్ షా భేటీ కావటం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి అమిత్ షా తారక్ తో సమావేశం కావాలని నిర్ణయించారని తెలుస్తోంది.
రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా ముందస్తు రాజకీయ స్ట్రాటజీల్లో భాగంగానే తారక్ తో సమావేశం అవుతున్నారనే చర్చ సాగుతోంది. అయితే, ఇప్పుడు ఇది ప్రధానంగా టీడీపీ నేతల్లో చర్చకు కారణమవుతోంది. తాను పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసానని జూ ఎన్టీఆర్ కొంత కాలంగా చెబుతూ వచ్చారు.

కానీ, ఇప్పుడు అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీ ఇటు తెలంగాణలోఅటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది తాత స్థాపించిన పార్టీ కోసం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటానని గతంలో జూనియర్ చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత టీడీపీ రాజకీయాల్లో దూరం పాటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మేనత్త పురంధేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

దీంతో ఇప్పుడు అమిత్ షా స్వయంగా జూనియర్ ను విందుకు పిలవడం కేవలం అభిమానంతో జరుగుతున్న సమావేశమా?లేక, బీజేపీ భవిష్యత్ రాజకీయాల్లో తారక్ కీలకం కాబోతున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే వీళ్లిద్దరి భేటి తెలుగు రాజకీయాలను మలుపు తిప్పనుంది.