Site icon HashtagU Telugu

Holidays : ఆగ‌స్టు 29, 30 తేదీల్లో ఆ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

TGPSC NEW UPDATE

Holidays : గ్రూప్-2 పోస్టుల భర్తీకి తెలంగాణలో ఆగ‌స్టు 29, 30 తేదీల్లో ఎగ్జామ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్లకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, పాఠశాలలకు ఆ రోజు  సెల‌వు(Holidays) ఉంటుంది. అయితే మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు యథావిధిగా న‌డుస్తాయి. ఈ మేరకు జులై 14న రాష్ట్ర  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగ‌స్టు 29, 30 తేదీల్లో ఉదయం, మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో రెండు విడతల్లో గ్రూప్-2 ఎగ్జామ్ జరుగుతుంది.  పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను జారీ చేస్తారు.  783 గ్రూప్-2 ఉద్యోగాలకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడుతున్నారు.

Also read : Your Tweets Vs Musk plan : “మస్క్” మస్త్ ప్లాన్.. మన ట్వీట్లను ఇలా వాడుకుంటారట

ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also read : Project K Glimpse: ‘ప్రాజెక్ట్-కే’ నుంచి బిగ్ అప్డేట్.. ఈనెల 21న ఫస్ట్ గ్లింప్స్..!