February 15 Holiday : ఫిబ్రవరి 15 ఐచ్ఛిక సెలవు.. ఎందుకో తెలుసా ?

February 15 Holiday : సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.

  • Written By:
  • Updated On - February 10, 2024 / 11:08 AM IST

February 15 Holiday : సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు. బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజున సెలవును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ వచ్చే జయంతి నాటికి రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ కోరగా కోమటిరెడ్డి ఈమేరకు హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్ ఎవరు ?

1739 ఫిబ్రవరి 15న(February 15 Holiday) అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్  జన్మించారు. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. జగదంబకు అత్యంత ప్రియ భక్తుడు. బ్రహ్మచారి అయిన సేవాలాల్.. విశిష్ట బోధనలతో కీర్తి ప్రతిష్ఠలను పొందారు. ఆయన్ను చాలా మంది భక్తులు అనుసరించేవారు. బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల అరాచక, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్‌ సేవాలాల్‌ కీలక పాత్ర పోషించారు. ఓ వైపు ఇంగ్లిష్ వాళ్లు.. మరోవైపు ముస్లిం పాలకుల ప్రభావానికి బంజారాలు లోనుకాకుండా సేవాలాల్‌ ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన బంజారాలకు ఆరాధ్య దైవమయ్యాడు. లిపిలేని బంజారాల భాషకు ఒక రీతిని సమకూర్చింది కూడా సేవాలాల్‌ మహారాజే.  కోట్లాదిగా బంజారాలు స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ.. ఒకేరకమైన భాషను మాట్లాడగలుగుతున్నారంటే అది సంత్‌ సేవాలాల్‌ కృషి ఫలితమే.

Also Read : Sachin Das : మరో సంచలనం సచిన్ దాస్.. ఎవరీ ప్లేయర్ ? బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి ?

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులివే..

గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా.. కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కూడా. కనుక మనం బ్యాంకు శాఖకు వెళ్లాలనుకున్న వారు.. ఆ రోజు సెలవు ఉందా? లేదా..? అన్న సంగతి తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి ఫిబ్రవరిలో మొత్తం బ్యాంకుకు 11 రోజులు సెలవులు ఉన్నాయి.

ఫిబ్రవరి 4 – ఆదివారం

ఫిబ్రవరి 10- రెండో శనివారం

ఫిబ్రవరి 11 – ఆదివారం

ఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజ

ఫిబ్రవరి 15 – లుయి గాయి నీ (ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు)

ఫిబ్రవరి 18 – ఆదివారం

ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌ల్లో సెలవు)

ఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.

ఫిబ్రవరి 24- నాలుగో శనివారం