తెలంగాణ వ్యాప్తంగా (Telangana) రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు (Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రభుత్వ , ప్రవైట్ విద్యాసంస్థలకు సెలవు (Holiday declared for all schools) ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వర్షం, వరదలో సెల్ఫీల కోసం యువత ప్రాణాలను పణంగా పెట్టొద్దని సూచించారు. అటు నేషనల్ హైవేలపై వరద ప్రవహిస్తోందని, చాలా ప్రాంతాల్లో పంటపొలాలు నీట మునిగినట్లు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడం తో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఖమ్మం, సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. కొన్ని చోట్ల హైవేలపై నీరు చేరిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. అనేక చోట్ల పంటపొలాలు నీటమునిగాయన్నారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని.. లీవ్ అప్లై చేసిన వారు వెంటనే రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలన్నారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు అందించాలని రేవంత్ ఆదేశించారు.
Read Also : Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు