మరోసారి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ భూములను వేలం (HMDA Lands for Sale) వేసేందుకు సిద్ధమైంది. కాకపోతే ఈసారి సామాన్య ప్రజలకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తరచుగా వేలం ద్వారా భూములను విక్రయిస్తుంటుంది. ఈ భూములు పక్క క్లియర్ టైటిల్‌తో ఉండడం వల్ల కొనుగోలుదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతిసారి సామాన్యులు కొనుగోలు చేయలేని రీతిలో పెద్ద పెద్ద ఫ్లాట్స్ అమ్మకం చేస్తుంటారు. దీంతో అంత పెద్ద ఫ్లాట్స్ అంతంత ధరలు పెట్టి కొనుగోలు చేసేందుకు సామాన్య ప్రజలు ముందుకు రారు. దీంతో బడా నిర్మాణ సంస్థలు మాత్రమే వీటిలో పాల్గొని దక్కించుకుంటాయి. ఈ పరిస్థితికి భిన్నంగా, ఈసారి హెచ్‌ఎండీఏ సామాన్యులకూ అందుబాటులో ఉండే ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమైంది.
Meerpet Murder: మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఈ కథ వెనుక ఓ మహిళ..?
హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 38 ప్లాట్లను మార్చి 1న వేలం వేయనుంది. ఈ ప్లాట్ల వేలం ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. విక్రయానికి పెట్టబోయే ఈ ప్లాట్లు వందశాతం క్లియర్ టైటిల్‌తో ఉండటమే కాక, కొనుగోలుదారులు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేలా చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో గండిపేట, శేరిలింగంపల్లి, ఇబ్రాహీంపట్నం ప్రాంతాల్లో ప్లాట్లను వేలం వేయనున్నారు. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాలు మరియు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్, ఆర్.సి పురం, జిన్నారం ప్రాంతాల్లో కూడా ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 121 గజాల నుంచి 3,630 గజాల విస్తీర్ణంలో ఉండనున్నాయి. ఈ వేలాల్లో సామాన్యులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమీన్‌పూర్, ఆర్.సి పురం, జిన్నారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఆ ప్రాంతాల్లో విలువ పెరుగుతున్న పరిణామం కావడం విశేషం. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం ఖచ్చితంగా లాభదాయకమవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.