HMDA Lands: హైదరాబాద్ భూముల ఈ-వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధం, విలువైన భూముల విక్రయం!

రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  • Written By:
  • Updated On - August 9, 2023 / 12:39 PM IST

హైదరాబాద్: మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌, పీరంచెరువు.. మేడ్చల్‌ – మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం.. సంగారెడ్డిలో వెలిమల, నందిగాయ, అమీన్‌పూర్‌, పతిఘనపూర్‌, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది. చదరపు గజానికి కనీస ధర ₹12వేలు, గరిష్ఠ ధర ₹65వేలుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా.. 18 నుంచి ఈవేలం నిర్వహించనున్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రియల్ భూంకు అడ్గాగా మారింది. ప్రధాన రహదారులు, విశాలమైన స్తలాలు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. ఈ అంశాలే తెలంగాణ ప్రభుత్వానికి వరంగా మారాయి. హైదరాబాద్ – కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్ల విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. బుద్వేల్ భూముల అమ్మకం కోసం ఈ నెల 10వ తేదీన ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ భూములకు ఎకరాకు 20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు.

కోకాపేటలో భూముల్ని వేలం వేయడానికి ప్రభుత్వం 2020లోనే ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 49.92 ఎకరాల భూమిని వెంచర్ గా మార్చే ప్రక్రియ ప్రారంభించింది. ఈ వెంచర్ కు నియోపొలిస్ అనే పేరుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాపర్టీ ఇది. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేటకు రావాలంటే భారీ ట్రాఫిక్ దాటాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన హెచ్ఎండీఏ దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టి, ట్రంపెట్ రూపంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసింది. హైదరాబాద్ శివారు భూములు కోట్లు కురిపిస్తుండటం గమనార్హం.

Also Read: Pawan Wishes Mahesh: కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ, విభిన్న పాత్రల్లో మెప్పిస్తూ.. మహేశ్ కు పవన్ బర్త్ డే విషెస్!