Site icon HashtagU Telugu

BRS : బీఆర్ఎస్‌లోకి భారీగా వ‌ల‌స‌లు.. గులాబీ కండువా క‌ప్పుకున్న హిమాయ‌త్ న‌గ‌ర్ బీజేపీ కార్పోరేట‌ర్‌

BRS

Bjp's Strength Is The Gain For Brs.. How Is It..

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశించి భంగ‌ప‌డ్డ వారు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ నుంచి ప్ర‌తిప‌క్షానికి, ప్ర‌తిప‌క్షం నుంచి అధికార పార్టీలోకి వ‌ల‌సలు కొన‌సాగుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లో బీజేపీ కార్పోరేట‌ర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి గులాబీ కండువా క‌ప్పుకున్నారు. హిమాయత్‌నగర్ BJP కార్పొరేటర్ మ‌హాల‌క్ష్మీ, ఆమె భ‌ర్త రామ‌న్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరారు. వీరితో పాటు మ‌రికొంత మంది కార్పోరేట‌ర్ అనచ‌రులు బీఆర్ఎస్‌లో చేరారు. మ‌రో 9 మంది కార్పోరేట‌ర్లు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌మైయ్యారు.ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి టిక్కెట్లు ఆశించిన ఈ తొమ్మిది మంది బీజేపీ కార్పొరేటర్లు హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. వీరిలో ఎల్‌బీ నగర్‌, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి డివిజ‌న్ కార్పొరేటర్లు ఉన్నారు.వీరంతా జాతీయ అధినాయ‌క‌త్వాన్ని క‌లిసి మ్మెల్యే టికెట్‌ కోరుతూ ద‌ర‌ఖాస్తులు కూడా చేశారు. అయితే త‌మ దరఖాస్తులను తెలంగాణ బీజేపీ కూడా పరిగణనలోకి తీసుకోలేదని వారు గ్ర‌హించారు. కాంగ్రెస్‌తో త‌మ‌కు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని.. బీఆర్‌ఎస్‌లో చేరాలా, స్వతంత్రంగా పోటీ చేయాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేద‌ని కార్పోరేట‌ర్లు తెలిపారు. త్వ‌ర‌లో వీరు కూడా బీజేపీని వీడే అవ‌కాశం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

Also Read:  India Against South Africa: దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్స్ వీళ్ళే..!