hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఫలితంగా నగర ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని బేగంపేట (38.6 ° C) సరూర్‌నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్‌ను దాటాయి. ఇక కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్‌గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో 37 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. GHMC పరిధిలో, గరిష్ట ఉష్ణోగ్రతలు 34° నుండి 36°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21°C నుండి 23°C వరకు ఉండవచ్చు.
హైదరాబాద్ వేసవిలో ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌లలో తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ మార్చి ప్రారంభంలోనే ఎండలు కొడుతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యలు తల్తెతే అవకాశం ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ, గుండె జబ్బులు, మధుమేహం లాంటి లక్షణాలు జనాలకు ఇబ్బందులకు గురిచేస్తాయి.
హైదరాబాద్‌లో వేసవి లో చాలా కూల్ గా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా మంచినీరు తాగాలి. ఎయిర్ కండిషనింగ్, ఫ్యాన్లు లేదా ఏసీలను వాడుకొని శరీరాలను చల్లబర్చుకోవాలి. ఇక కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లాలి.
