Highcourt: న్యూ ఇయర్ వేళ పబ్ వెళ్లేవారికి ఆంక్షలు..వారికి శిక్ష తప్పదు

న్యూ ఇయర్ వేళ పబ్ ప్రియులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు కీలక సూచన చేసింది.

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 08:12 PM IST

Highcourt: న్యూ ఇయర్ వేళ పబ్ ప్రియులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు కీలక సూచన చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పబ్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఆదేశంతో జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టకుండా ఉండాల్సి ఉంది. న్యూ ఇయర్ ఈవెంట్స్ లో రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సంబరాలు చేసుకునేవారికి గట్టి షాక్ తగిలినట్లైంది.

అయితే పబ్ లపై హైకోర్టు తీర్పును చాలా మంది స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్ లను పూర్తిగా కాలనీ నుంచి తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమస్యలను తెలుపుకుంటున్నారు. దీంతో తాము దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు వర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు.

పబ్ ల కారణంగా చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంలో పబ్ లకు స్థానికంగా ఉండే నివాసాల్లోని ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారనే విషయం అందరికీ తెలిసిందే. పబ్ ల నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో పబ్ నిర్వాహకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే రాత్రి వేళ వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమ బాధలు తీరినట్లేనని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు కూడా విధించడంతో సెలబ్రేషన్స్ చేసుకునేవారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇవ్వగా ఆ తర్వాత ఎవ్వరూ కనిపించినా భారీ జరిమానాను విధించనున్నారు. ఇకపోతే పబ్బుల్లోకి మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.