Khammam Congress Mp Candidate : బెంగుళూర్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయితీ

ఇలా ఎవరికీ వారు వారి వారి పట్టుదలతో ఉండడంతో ఖమ్మం పంచాయతీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది

Published By: HashtagU Telugu Desk
Kmm Lok

Kmm Lok

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఖమ్మం అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ (COngress) అధిష్టానం తేల్చలేకపోతుంది. ఖమ్మం స్థానం (Khammam Congress Mp Candidate) కోసం అనేకమంది పోటీ పడుతుండడంతో ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేక గత కొద్దీ రోజులుగా ఈ టికెట్ ను పెండింగ్ లో పెడుతూ వస్తుంది. తాజాగా పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అవ్వగా..మిగతా కీలక నేతలు మాత్రం ఆయనకు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సీటు ఎలాగైనా తమ సోదరుదు ప్రసాద్ రెడ్డి కే ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతుండగా.. ఇదే సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా పట్టుదలతో ఉన్నారు. తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు కు ఇస్తే మాకు సంతోషమే అని తుమ్మల కూడా అంటూ వస్తున్నారు. ఇక సీఎం రేవంత్ మాత్రం మండవాకు మొగ్గు చూపిస్తున్నారట. ఇలా ఎవరికీ వారు వారి వారి పట్టుదలతో ఉండడంతో ఖమ్మం పంచాయతీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది. మల్లు భట్టి, శ్రీనివాస్ రెడ్డిలను డీకే శివకుమార్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా దీనిపై ఓ ఫైనల్ నిర్ణయం వస్తుందని అంటున్నారు. మరి శివకుమార్ ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.

Read Also : Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన

  Last Updated: 22 Apr 2024, 01:20 PM IST