తెలంగాణ (Telangana) లో ఎన్నికల సమరానికి (TS Polls) ఇంకా 15 రోజులు మాత్రమే ఉండడం తో అధికార (BRS) – ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ (Congress) కార్యకర్తల మధ్య గొడవలు , రాళ్ల దాడులు , పరస్పరం గొడవలకు దిగడం వంటివి ఎక్కుఅవుతున్నాయి. ఇప్పటీకే పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా రేవంత్ బరిలోకి దిగిన కొడంగల్ (Kodangal ) లోఉద్రిక్తత వాతావరణం (High Tension) నెలకొంది. కోస్గి మండలంలోని సర్జాఖాన్‌పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను.. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చగొట్టారని అంటున్నారు. AS రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్తే సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్‌ను ఆయన ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు . దాదాపు 50 వాహనాల్లో 100 మంది అనుచరులతో కోస్గికి వచ్చిన సోమశేఖర్‌రెడ్డి.. తమపై దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం కొడంగల్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుస దాడుల ఘటనలతో కొడంగల్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Btech Ravi : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్..