కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ ( Yashoda Hospital) వద్ద ఉద్రిక్తత వాతావరణం (High Tension ) నెలకొంది. కేసీఆర్ (KCR) ను చూడాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు రావడం తో అక్కడ ఒక్కరిగా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ ను కల్పించడం కుదరదని చెప్పడం తో హాస్పటల్ వద్దే వారంతా బెటాయించి ఆందోళన చేస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు.
ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వారు ఏమాత్రం వినకుండా అలాగే ఆందోళన చేస్తున్నారు. అంతకుముందు.. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా తరలిరావడంతో కేటీఆర్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత.. కేసీఆర్ కూడా ఓ వీడియో సందేశం ద్వారా.. అభిమానులు ఎవరూ ఆస్పత్రికి రావద్దుని సూచించారు. అయినప్పటికీ వినకుండా కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్ద నినాదాలు చేస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెడతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ సైతం త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని దయచేసి అందరూ సహకరించాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హాస్పటల్ కు ఎవ్వరూ రావద్దని కోరారు. తనను పరామర్శించడానికి యశోద హాస్పటల్ కు తరలివస్తున్న ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్లో వీడియోను విడుదల చేశారు. హాస్పటల్ లో తనతోపాటు వందలాది మంది పేషంట్లు ఉన్నారు వారికి ఇబ్బంది కలగకూడదన్నారు. అందరూ రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకే డాక్టర్లు బయటకు పంపడం లేదన్నారు.
తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని తెలిపారు. తానెప్పుడూ ప్రజల మధ్యనే ఉండేవాడినేనన్నారు. అందుకే అప్పటి వరకు సంయమనం పాటించి యశోద హాస్పటల్ కు రావొద్దని కోరారు.
Read Also : Google Top Celebrities 2023: గూగుల్ టాప్ సెర్చ్ లో ఉన్న పదిమంది సెలబ్రిటీలు