TS Poll Results: నాగర్ కర్నూలు జిల్లాలో హైటెన్షన్..కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్

నెలకొండ మార్కెట్ యార్డ్ లో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద నుండి ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టి

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 07:57 AM IST

నాగర్ కర్నూలు (Nagarkurnool) జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలుకానున్న నేపథ్యంలో పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టడం..లాఠీఛార్జ్ కి దారితీసింది. జిల్లా కేంద్రంలోని నెలకొండ మార్కెట్ యార్డ్ లో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద నుండి ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టి.. బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న కాంగ్రెస్ MLC దామోదర్ రెడ్డి వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన గదిని పరిశీలించారు. అయితే, ఖాళీ బాక్స్ లు మాత్రమే భద్రపరుస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్పుకొచ్చారు. దీనిపై దామోదర్ రెడ్డి ఆరా తీస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె నిన్న శనివారం ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam ) లో ఉద్రిక్తత నెలకొంది. ఇబ్రహీంపట్నం లో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్ ల సీల్ తొలగించి ఉంచడం..అందులో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు లేకపోవడం ఫై అనేక అనుమానాలు రేకెత్తించాయి. నవంబర్ 29 న పోస్టల్ బ్యాలెట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్ లో భద్రపరిచారు. కానీ ఆ తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా ఉంచిన విషయాన్నీ తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు..శనివారం పెద్ద ఎత్తున ఆర్డీవో ఆఫీస్ ను చుట్టుముట్టారు. ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు. ఇదే క్రమంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లు బాక్స్ లకు సీల్ లేకుండా ఉండడం..అందులో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు లేకపోవడం తో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏదో పెద్ద కుట్ర జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్‌ వేశారు. పోలింగ్‌ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also : Telangana Results : అందరి చూపు కామారెడ్డి ..గజ్వేల్ రిజల్ట్ పైనే..