మొన్నటి వరకు హైదరాబాద్ (Hyderabad) వాసులంతా ఎంతో సంతోషంగా తమ పని తాము చేసుకుంటూ ..ఎంతో ఆనందంగా జీవించేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరు వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. పది రోజులుగా పనిపోకుండా తమ ఇళ్ల ముందు కూర్చుని కాపలాకాసుకుంటున్నారు. హైడ్రా, మూసీ, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ఈ పదాలు వింటే చాలు నిద్ర పట్టడం లేదని , అన్నం తినబుద్ది కావడం లేదని అంటున్నారు. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, తమ ఇళ్లను ఎక్కడ కూల్చేస్తారో అని భయం వేస్తుందని..రేపు ఆదివారం..ఏంజరుగుతుందో అని వారంతా ఖంగారుపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని, అధికారులతో మాట్లాడిన కూడా స్పందన కరువైందని వాపోయారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ, ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని మండిపడుతున్నారు. కాయ కష్టం చేసి జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని.. ఇండ్లు కట్టుకున్న పేదల పొట్టమీద కొట్టొద్దు అంటున్నారు. మరికొంతమంది మమ్మల్ని చంపి మా ఇళ్లను కూల్చేయ్యండి అంటున్నారు. వారి ఆవేదనను మీరే చూడండి.
Read Also : Hezbollah : హిజ్బుల్లాకు షాక్.. హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి