Site icon HashtagU Telugu

HIGH TENSION at Kaushik Reddy House : కౌశిక్ రెడ్డి ఇంటి ఫై గాంధీ అనుచరులు దాడి..

High Tension At Kaushik Red

High Tension At Kaushik Red

కొండాపూర్ లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం (HIGH TENSION) నెలకొంది. నిన్న తెలంగాణ భవన్ లో కౌశిక్ రెడ్డి..శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Arikepudi Gandhi ) తో పాటు పలువురు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ ప్రకటించాడు. దీంతో కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేసారు. అటు గాంధీ కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే నా ఇంటికి రా.. లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఇలా ఇరు నేతల సవాళ్ల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అని ముందు జాగ్రత్తగా పోలీసులు నిర్బంధం చేసారు.

నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా..

గాంధీ చెప్పినట్లే కౌశిక్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున తన అనుచరులతో వెళ్ళాడు..అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి చొచ్చుకెళ్లి అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో పగులగొట్టారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు. నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా.. అంటూ కౌశిక్‌ రెడ్డికి గాంధీ సవాల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బయటకు రావాలంటూ అక్కడే బైఠాయించారు. కోవర్టుల మూలంగా పార్టీ నాశనం అయ్యిందని దుయ్యబట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు గాంధీ. కరీంనగర్ నుంచి నీవు బతకడానికి రాలేదా అంటూ ప్రశ్నించారాయన. క్రిమినల్ అని తెలిసి గవర్నర్ దూరంగా పెట్టింది వాస్తవం కాదా? అంటూ గాంధీ విమర్శించారు.

తెరపైకి నాన్ లోకల్ అంశం

మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అదేస్థాయిలో రెచ్చిపోయారు. తెలంగాణ పవరేంటో రేపు చూపిస్తానన్నారు. ఈ క్రమంలో నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. చివరకు పరిస్థితి గమనించిన పోలీసులు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

Read Also : Cricket Umpire: క్రికెటర్లు మాత్రమే అంపైర్లు కాగలరా? వారి జీతం ఎంత ఉంటుంది..?