Hyderabad Metro: వామ్మో.. మెట్రో: ముదురుతున్న ఎండలు, కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు!

ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టం చూపుతున్నారు.

  • Written By:
  • Updated On - April 20, 2023 / 03:09 PM IST

విశ్వనగరమైన హైదరాబాద్ (Hyderabad) కు పట్టణాలు, జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల ప్రయాణికుల తాకిడి సహాజంగానే ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ, ఎంఎంటీఎస్ లాంటివి అందుబాటులో ఉన్నా ట్రాఫిక్ (Traffic) సమస్యకు ఏమాత్రం చెక్ పెడటం లేదు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం మైట్రో రైళ్లను ప్రారంభించింది. అయితే ప్రారంభించిన కొత్తలో నష్టాలు వెంటడాయి. అయితే మెట్రో రైళ్లు (Metro) అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ తీరు ఏమాత్రం మారలేదు. దీంతో పలు రూట్లలో మెట్రలో అందుబాటులోకి రావడంతో జనాలు బస్సులు, ఇతర వాహనాలకు బదులు మెట్రో ఎక్కేందుకు ఇష్టపడుతున్నారు. గత సంవత్సరాల కాలంగా మెట్రో రైళ్లు జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అయితే సమ్మర్ సీజన్ కారణంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు, ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టం చూపుతున్నారు.

జనమే జనం

ముఖ్యంగా నాగోలు, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపారాలు, చదువుల కోసం జనాలు రాకపోకలు సాగిస్తుంటారు. చిరు ఉద్యోగస్తులు లేదా విద్యార్థులు (Students) బస్సులో ఛార్జీ తక్కువగా ఉంటుందని సాధారణ రోజుల్లో బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు బాగా ఎండలు ముదిరిపోవడంతో చల్లగా ఉంటుందని జనాలు మెట్రో రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

ముంబై రైళ్లను తలపిస్తున్న మెట్రో

ముంబయిలో (Mumbai) లోకల్ ట్రైన్ల విషయంలో తరచుగా కనిపించే దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కనిపించాయి. కరోనా సమయంలో పీక్స్ లో ఉండగా రోజూవారీ ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఈ ఎండాకాలం (Summer)లో రోజుకు ఐదు లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ పెరిగిపోతున్నా మెట్రో రైళ్లను పెంచకపోవడం, కోచ్ ల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భారమైనా మెట్రోలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.

Also Read: Ram Charan: షూటింగ్స్ కు రామ్ చరణ్ బ్రేక్..? పుట్టబోయే బిడ్డ కోసమేనా!