Site icon HashtagU Telugu

TS HighCourt: సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు

Singareni

Singareni

TS HighCourt: తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు సింగరేణి ఎన్నికలను కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. సింగరేణి ఓటు బ్యాంకు ప్రతి ఎన్నికల్లో ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణం. అయితే ఇప్పటి వరకు సింగరేణి బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27న జరగాల్సి ఉంది.

అయితే  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఎన్నికలపై విచారణ హైకోర్టు చేసింది. సింగరేణి ఎన్నికలపై విచారణను  హైకోర్టు వాయిదా వేసింది.

సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ  రాష్ట్ర  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ..ఇవాళ( డిసెంబర్ 18న) విచారించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై జెండా ఎగురవేయాలని  ప్లాన్ చేస్తోంది.