Site icon HashtagU Telugu

Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు

High Court Orders On Illega

High Court Orders On Illega

హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు (Key orders of the High Court) జారీ చేసింది. అయ్యప్ప సొసైటీ(Ayyappa Society)లో దాదాపు అన్ని నిర్మాణాలు (Illegal Building) అక్రమంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాల కూల్చివేత పనులను హైడ్రా మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి ఓ లేఖ పంపనున్నారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాల్లో అనేక హాస్టల్స్ కూడా వెలసి ఉన్నాయి. వీటిలో వందలాది విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేకుండా, ప్రాథమిక మౌలిక వసతులు లేని ఈ భవనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

అలాగే డ్రెయినేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హైడ్రా కమిషనర్, GHMC కమిషనర్‌తో కలిసి ఈ సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణలపై నోటీసులు జారీ చేయనున్నారు. ఇదిలా ఉంటె అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో అక్రమంగా అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైకోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు.

వీటిని దృష్టిలో ఉంచుకుని శనివారమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు అయ్యప్ప సొసైటీని సందర్శించారు. 100 ఫీట్ రోడ్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమని నిర్ధారించారు. గత ఏడాది జూన్‌లో జీహెచ్ఎంసీ మరోసారి నోటీసులు ఇచ్చినప్పటికీ బిల్డర్ స్పందించలేదు. దీనితో ఈ భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు.

Read Also : Poonam Kaur : త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన MAA ట్రెజరర్ శివబాలాజీ