Site icon HashtagU Telugu

Hydra Commissioner : హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్‌కు హైకోర్టు నోటీసులు

Ranganadh

Ranganadh

హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్‌ (Hydra Commissioner Ranganath)కు షాక్ ఇచ్చింది హైకోర్టు (Telangana High Court). అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు విష‌యంలో విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హైకోర్టు.. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్ ను కోర్ట్ ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు వర్చువల్ గా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదట ప్రభుత్వ స్థలాలు , చెరువులు కబ్జా చేసిన నిర్మాణాలు చేపట్టిన వాటిని కూలుస్తామని చెప్పింది..ఆ తర్వాత నూతనంగా కట్టే నిర్మాణాలు మాత్రమే కూలుస్తామని..నివాసం ఉండే నిర్మాణాల జోలికి వెళ్ళమని చెప్పింది..కానీ చేసేది మాత్రం అన్నింటికి రివర్స్. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న..పక్క రిజిస్టేషన్ ఉన్న ఇళ్లను సైతం కూల్చేస్తు వస్తుంది. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీరు కు నిరసనగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. అయినప్పటికీ హైడ్రా మాత్రం తగ్గడం లేదు. దీంతో రంగంలోకి దిగిన హైకోర్టు..కమిషనర్ రంగనాధ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

Read Also : BiggBoss Abhai: ‌హైడ్రాపై సంచలన కామెంట్స్.. బిగ్‌బాస్ కప్పు నాదే: బిగ్ బాస్ అభయ్