Site icon HashtagU Telugu

Hyderabad : వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…

Hyderabad Ganesh Nimajjanam

Hyderabad Ganesh Nimajjanam

వినాయక నిమజ్జనం (Ganesh Idols Immersion )పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం ట్యాంక్‌ బండ్‌(Hussain Sagar)లో వద్దని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెరువుల్లోనే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంది. జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా..అంటూ గణనాదులు తల్లి వద్దకు ఒక్కోటిగా చేరుకుంటున్నాయి. వినాయక ఉత్సవాలన్న , నిమజ్జనం అన్న హైదరాబాద్ తర్వాతే..అని అంత మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనం సమయంలో హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ వద్దకు పెద్ద సంఖ్యలో నగరవాసులు , భక్తులు చేరుకొని, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను చూస్తుంటారు.

ఈ క్రమంలో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని నగర పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను కూడా ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌ (నీటి కుంటలు)లో నిమజ్జనం చేయాలని సూచించింది. గణేష్ నిమజ్జనం ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌ లో జరుగుతుంది. ఈ సందర్భంగా జరిపిన విచారణ తర్వాత హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Khammam : తుమ్మల చేరిక తర్వాత పొంగులేటి మాట మార్చాడా..?