High Court :`పేప‌ర్ లీక్`ఎపిసోడ్ ట్విస్ట్‌,`బండి`కి బెయిల్ సిగ్న‌ల్

బండి అరెస్ట్ హైకోర్టుకు(High Court) వెళ్లింది. బెయిల్ పిటిష‌న్ వేసుకోవ‌చ్చ‌ని

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 05:09 PM IST

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య జరిగిన బండి సంజ‌య్ అరెస్ట్ వ్య‌వ‌హారం హైకోర్టుకు(High Court) వెళ్లింది. బెయిల్ పిటిష‌న్ వేసుకోవ‌చ్చ‌ని స‌ల‌హా ఇస్తూ రిమాండ్ పిటిష‌న్ పై విచార‌ణ‌ను హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ ను జైలు పంప‌డాన్ని కేసీఆర్ స‌ర్కార్ స‌మ‌ర్థించుకుంటోంది. కానీ, రాజ‌కీయంగా సానుకూల పరిస్థితుల కోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌స్తోన్న వేళ అరెస్ట్ ఎపిసోడ్ ను ర‌క్తిక‌ట్టించ‌డానికి బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.

బండి సంజ‌య్ అరెస్ట్ వ్య‌వ‌హారం హైకోర్టుకు(High Court)

పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ప్ర‌స్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (High Court)లంచ్‌ మోషన్‌ పిటిషన్ ను బీజేపీ దాఖ‌లు చేసింది. చ‌ట్టం ప్ర‌కారం 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్‌ చేశారని వాద‌న వినిపిస్తూ హ‌నుమ‌కొండ‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేస్తూ అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ , గురువారం మధ్యాహ్నం విచారణ జరిపారు.

రిమాండ్ క్వాష్ పిటిష‌న్ పై విచారణను ఈనెల 10కి వాయిదా

కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని ఆయన తరపు న్యాయవాది రామ‌చంద్రరావు కోర్టులో వాదించారు. బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వం త‌ర‌పు న్యాయ‌వాదిని ప్రశ్నించింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో సర్క్యూలేట్‌ చేశాడే తప్ప, పేపర్‌ లీకేజీలో ప్రమేయం ఎక్కడుందని అడిగింది. ప్ర‌శ్నాప‌త్రం పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని తెలిపింది.

బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని..

బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడని తేలింద‌ని ప్రభుత్వం (Telangana)తరుపున అడ్వకేట్‌ జనరల్ వాద‌న‌లు వినిపించారు. నిందితుడుప్రశాంత్‌కు, సంజయ్‌కు మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగిందని, కానీ ఆయన ఇంకా తన ఫోన్‌ను ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని(High Court) తెలిపింది.

Also Read : Bandi Sanjay Emotional: పోలీసులకు ‘బలగం’ సినిమా చూపెడితే బాగుండేది: భార్యతో బండి సంజయ్‌!

ఈరోజే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని హైకోర్టును(High Court) బండి త‌ర‌పున న్యాయవాది రామచంద్రరావు అభ్య‌ర్థించారు. శనివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. బెయిల్ పిటిష‌న్ వేసుకోవాల‌ని, ఒక వేళ కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిష‌న్ పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. ఈనెల 8న ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్(Telangana) వ‌స్తోన్న వేళ బండికి బెయిల్ వ‌స్తుంద‌ని బీజేపీ ఆశిస్తోంది. కానీ, బెయిల్ కంటే రిమాండ్ ర‌ద్దును బీజేపీ కోరుకుంటోంది. పేప‌ర్ లీక్ కేసుకు సంబంధించి బండిని ఎలా నిందితునిగా నిర్థారిస్తార‌ని నిల‌దీస్తోంది.

Also Read : SSC paper leak: బండి సంజయ్ కు రిమాండ్