TS : ఎంతకాలం ఇలా కాలక్షేపం చేస్తారు..తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..!!

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 08:05 AM IST

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మూడు మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తామని చెప్పి…ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించింది కోర్టు. భద్రాచలంతోపాటు మరో మూడు పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తే 2020లో వీరయ్య అనే వ్యక్తం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఏజేన్సీ ప్రాంతాల్లోని గ్రామాలను మున్సిపాలిటీగా మార్చే వీల్లేదంటూ జోవోను అప్పట్లో నిలిపివేసింది కోర్టు. అయితే ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

వాటికి సంబంధించిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినా…ఇంతవరకు ఎందుకు ఉత్తర్వులు జారీ చేయలేందంటూ కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే కోర్టు ఆగ్రహంతో జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరపు న్యాయవాది …అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందని వివరణ ఇచ్చారు. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చింది. అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈనెల 25లోగా నిర్ణయం తీసుకోకపోతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.