బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ (High Court BIG Shock to KTR) తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition)ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్‌పై ఇటీవల న్యాయవాదుల వాదనలు పూర్తవ్వగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించడంతో కేటీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు, కేసును విచారించేందుకు ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది. ఏసీబీ తరపు లాయర్ వాదనలను న్యాయమూర్తి సమర్థించుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఉన్న అరెస్టు స్టేను కూడా ఎత్తివేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ తీర్పు నేపథ్యంలో కేటీఆర్‌కు ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గంగా ఉంది.
YS Sharmila : కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కేటీఆర్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. హైకోర్టులో ఆయన తరపున సీనియర్ లాయర్ సిద్ధార్థ దవే వాదనలు వినిపించినప్పటికీ, కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో మరింత చురుకుగా న్యాయపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇక, ఏసీబీ కేటీఆర్‌ను తొమ్మిదో తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ డేట్ వరకు ఆయనను అరెస్టు చేయకుండా ఉండవచ్చని అనుమానం ఉన్నా, ఆ రోజున ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే, ఈడీ విచారణలో కూడా కేటీఆర్‌కు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈడీ ముందు హాజరు కావడానికి ముందుగా వాయిదా కోరిన కేటీఆర్, ఇప్పుడు కొత్త నోటీసును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ, ఏసీబీ ఇద్దరూ ఆయనపై విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం.