Formula-E Car Race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
కాగా, కేటీఆర్ ఈనెల 6వ తేదీన ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తన లాయర్‌ను విచారణకు తనతో పాటు అనుమతి ఇవ్వలేదు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ లాయర్‌ను లోపలికి అనుమతి ఇవ్వకపోవంతో తిరిగి వెళ్లారు. దీంతో విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అందులో ఈనెల 9వ తేదీన గురువారం విచారణకు రావాలని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఇకపోతే.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈరోజు సీబీ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు ఏ2 గా ఉన్న అరవింద్ కుమార్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్నారు. నగదు బదిలీలో అరవింద్ కుమార్ కీలక వ్యక్తి అనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి కూడా హాజరయ్యారు. పూర్తి డాక్యుమెంట్లతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు.
Read Also: Drug Mafia : డ్రగ్ మాఫియాతో ఎన్టీఆర్ కు సంబంధం..?