Site icon HashtagU Telugu

Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ అనుమతి

Ganesh Immersion

Ganesh Immersion

High Court allow immersion of Ganesha on Tankbund: హుస్సేన్ సాగర్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు అనుమతించింది. కంటెమ్ట్ పిటిషన్ మెయింటనెబుల్ కాదన్నా హైకోర్టు.. పిటిషన్ కొట్టేసింది. మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2021 ఆదేశాలు యథావిథిగా కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. వాటిని అమలు చేయాలని హైకోర్టు సూచించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్న హైకోర్టు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ కొట్టి వేసింది. పిటిషనర్ కోర్టు ధిక్కరనపై ఆధారాలు చూపలేక పోవడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని హైకోర్టు వెల్లడించింది. గణేష్ నిమజ్జన చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని హైకోర్టు పిటిషనర్‌కు తెలిపింది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని సజావుగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌లోని వివిధ జోన్లలో దాదాపు 73 ఇమ్మర్షన్ పాయింట్లను వివిధ సైజుల్లో ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇమ్మర్షన్ జోన్ల జాబితా క్రింది విధంగా ఉంది:

పోర్టబుల్ చెరువులు:

ఎల్బీ నగర్ జోన్: AS రావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్, హయత్ నగర్ MRO ఆఫీస్, వనస్థలిపురం, సుమ థియేటర్ క్రికెట్ గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ వెనుక ప్రభుత్వ కళాశాల మైదానం

చార్మినార్: రియాసత్‌నగర్ శివాలయం గ్రౌండ్స్, లక్ష్మీ నారాయణ ప్లేగ్రౌండ్స్, జంగమ్మెట్

ఖైరతాబాద్: రామ్ లీలా గ్రౌండ్స్, చింతల్ బస్తీ, 100 అడుగుల రోడ్డు, SBA గ్రౌండ్స్ ఎదురుగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అమీర్‌పేట్ ప్లేగ్రౌండ్

సెరిలింగంపల్లి: పీజేఆర్ స్టేడియం, చందానగర్, సఖి చెరువు, పటాన్చెరు

కూకట్‌పల్లి: చిత్రమ్మ దేవాలయం, వివేకానంద నగర్, HMT ఓపెన్ ప్లేస్, ESI హాస్పిటల్

సికింద్రాబాద్: ఎన్టీఆర్ స్టేడియం, ఆజాద్ నగర్, అంబర్‌పేట్ డంప్ యార్డ్ సమీపంలో, చిల్లకల్‌గూడ మున్సిపల్ గ్రౌండ్స్.

ఎస్కలేటర్ చెరువులు:

ఎల్బీ నగర్: దేవేందర్ నగర్ రోడ్, హుడా భాతీ నగర్ పార్క్ , ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్

చార్మినార్: ఫ్రెండ్స్ కాలనీ హోటల్ కోర్టు, SBH కాలనీ సైదాబాద్, బతుకమ్మ బావి కందికల్ గేట్, గౌలిపుర, వైశాలి నగర్, బావికుంట, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పర్‌పల్లి శివాజీ హిల్స్, మూసీ నది సమీపంలో, పాతికుంట , రాజన్న బావి.

ఖైరతాబాద్: పిల్లర్ నంబర్ 54, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, రామ్ లీలా గ్రౌండ్స్, చింతల్ బస్తీ, జంసింగ్ టెంపుల్, గుడిమల్కాపూర్, దోభీ ఘాట్, 100 అడుగుల రోడ్డు, సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మారుతీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్

సెరిలింగంపల్లి: గోపనపల్లి రోడ్డు సమీపంలోని రంగనాయక దేవాలయం, రేగులకుంట చెరువు, సఖి చెరువు, దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్గొండ చెరువు, గోపి చెరువు, గంగారం చెరువు, కైదమ్మ కుంట, గుర్నాథం చెరువు, రాయి సముద్రం.

కూకట్‌పల్లి: HMT నగర్ ఓపెన్ ప్లేస్ ESI హాస్పిటల్ సమీపంలో, ముల్కత్వ చెరువు, IDL బేబీ చెరువు, బాలాజీ నగర్, బోయిన చెరువు బేబీ చెరువు, ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ హైదరానగర్, లింగం చెరువు, కొత్త చెరువు,

సికింద్రాబాద్: ఎన్టీఆర్ స్టేడియం, చెర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ చెరువు, సంజీవయ్య పార్కు, సఫిల్ గూడ, బండ చెరువు.

Read Also : Health Tips : ఆహారం తిన్న వెంటనే ఈ 4 పనులు చేస్తే కడుపునొప్పి నుండి విముక్తి !