హైకోర్టులో వనమాకు మళ్లీ చుక్కెదురు

బిఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు మరో షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు

Published By: HashtagU Telugu Desk
high court again shock to vanama venkateswara rao

high court again shock to vanama venkateswara rao

బిఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateswara Rao) కు మరో షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. వనమా ఎన్నిక చెల్లదని ఈ నెల 25న హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వనమా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో మధ్యంతర పిటిషన్​ను వేశారు. అయితే వనమా విజ్ఞప్తిని బుధువారం హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును కొట్టివేసింది.

ఇక వనమా చేతిలో ఓటమిపాలైన జలగం వెంకట్రావు (Jalagam Venkat rao) 2019లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను ఆమోదిస్తూ జస్టిస్‌ జీ రాధారాణి మంగళవారం 84 పేజీల సుదీర్ఘ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు వనమా రానందున ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వనమా ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించడం చెల్లదని న్యాయమూర్తి పేర్కొంటూ.. వనమాకు బదులుగా పిటిషనర్‌ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించారు.

మరోపక్క కొత్తగూడెం (kothagudem) శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ చెప్పినట్లు జలగం వెంకట్రావు తెలిపారు.

Read Also: KTR & Harish: బీఆర్ఎస్ ‘బిగ్ షాట్స్’ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేనా!

  Last Updated: 27 Jul 2023, 02:31 PM IST