Site icon HashtagU Telugu

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలర్ట్, విజిటర్స్ కు నో ఎంట్రీ

UK Visa

UK Visa

దేశంలోని ప్రముఖ ఎయిర్ పోర్ట్స్ లలో శంషాబాద్ ఒకటి. దేశీయ, అంతర్జాతీయ రాకపోకలకు కేరాఫ్ అడ్రస్. అయితే కొద్దిరోజులుగా వేలాది మందితో రద్దీ నెలకొనడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన రహదారిపై సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15 వరకు సందర్శకులను విమానాశ్రయంలోకి అనుమతించబోమని ప్రకటించగా.. ప్రయాణికులకు, వారి బంధువులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఆగస్టు 16 వరకు అన్ని రకాల పాస్‌లను బలగాలు రద్దు చేశాయి.

విమానాశ్రయంలోని పార్కింగ్, డిపార్చర్, అరైవల్ ఏరియాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో సీఐఎస్‌ఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరు వస్తే పెద్దగా వచ్చేందుకు వీలు లేదని అధికారులు చెబుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల రాకతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఒకరిని పంపించేందుకు తల్లిదండ్రులు, బంధువులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ 15 రోజులు రాకూడదని కేంద్ర బలగాలు అప్రమత్తం చేస్తున్నాయి.

Also Read: Varadavelli Dattatreya: కోరిన కోరికలు తీర్చే ‘వరదవెల్లి’ దత్తాత్రేయుడు!