Huge Drugs Caught : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళ నుండి భారీగా హెరాయిన్‌ పట్టివేత

డ్రగ్స్ (Drugs ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉక్కుపాదం మోపింది..ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనేవి కనిపించకూడదని, వినిపించకూడదని..డ్రగ్స్ వాడేవారిపై..సరఫరా చేసేవారిపై అస్సలు వదలొద్దని..దీనివెనుక ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు , పోలీసులు ప్రతి రోజు అనేక సోదాలు చేస్తూ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. We’re now on WhatsApp. Click […]

Published By: HashtagU Telugu Desk
Heroin Seizure At Shamshaba

Heroin Seizure At Shamshaba

డ్రగ్స్ (Drugs ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉక్కుపాదం మోపింది..ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనేవి కనిపించకూడదని, వినిపించకూడదని..డ్రగ్స్ వాడేవారిపై..సరఫరా చేసేవారిపై అస్సలు వదలొద్దని..దీనివెనుక ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు , పోలీసులు ప్రతి రోజు అనేక సోదాలు చేస్తూ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈరోజు శంషాబాద్‌లోని విమానాశ్రయం (Shamshabad Airport)లో భారీగా మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున తరలిస్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ 5.92 కిలోల వరకు ఉండగా.. దాని విలువ రూ.41కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని హెరాయిన్‌ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నది.. ఎక్కడికి తరలిస్తున్నది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

గతంలో కూడా జాంబియాకు చెందిన మకుంబా కరోల్‌ అనే మహిళ ..ఎనిమిది కిలోల హెరాయిన్ ను తీసుకురాగా డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఖతర్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానంలో దోహా నుంచి మహిళ హైదరాబాద్‌కు వచ్చింది. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.53కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Read Also : Isro Ayodhya Ram Mandir Pics : ఇస్రో పంపిన అయోధ్య రామ మందిర్ పిక్స్ ..ఎంత అద్భుతంగా ఉన్నాయో..!!

  Last Updated: 21 Jan 2024, 07:46 PM IST