Site icon HashtagU Telugu

Hero Venkatesh : హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబుకు షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

Hero Venkatesh

Hero Venkatesh

Hero Venkatesh : హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోలు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానాలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ కేసు నిందితుడు నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ హోటల్‌‌‌‌‌‌‌‌ను కూల్చివేయడంపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థలం లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దౌర్జన్యంగా హోటల్‌ను కూల్చేశారని నందకుమార్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్‌‌‌‌‌‌‌‌.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కలిసిపోయి ఏకపక్షంగా, దౌర్జన్యంగా కూల్చివేతకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. 60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుని భవనాన్ని ధ్వసం చేసి, ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. డెక్కన్ కిచెన్‌ను కూల్చేయడం వల్ల తనకు రూ .20 కోట్ల నష్టం వచ్చిందన్నారు.  ఈమేరకు నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ముగ్గురి (దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానా)పై ఐపీసీ సెక్షన్ 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా, కొద్ది రోజుల క్రితమే హీరో వెంకటేష్(Hero Venkatesh), నిర్మాత సురేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Also Read :CAA In 7 Days : వారం రోజుల్లోగా సీఏఏ అమల్లోకి.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్

మొయినాబాద్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ వేదికగా తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్‌ ఇటీవల తెలంగాణ డీజీపీని కలిశారు. తన ఆస్తులపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్పట్లో ఓ సంచలనం. అది ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. అందులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న నందకుమార్‌.. తాజాగా తెలంగాణ డీజీపీని కలిశారు. మ్యాటర్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి కాదు. తాను జైల్‌లో ఉన్న టైమ్‌లో తన  డెక్కన్ కిచెన్ హోటల్‌ను కొందరు అక్రమంగా కూల్చేశారని డిజీపీ రవిగుప్తకు ఆయన ఫిర్యాదు చేశారు. ఎవరెవరు ఎలా తన హోటల్‌పై దాడి చేశారో ఆధారాలను డీజీపీకి ఇచ్చానన్నారు. తన హోటల్‌పై దాడి సహా ఆడియో టేపులపై సమగ్ర విచారణ జరిపాలని డీజీపీని కోరానన్నారు నందకుమార్‌. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిజాలు ఏంటో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఐతే తన ఆస్తులపై దాడి.. అక్రమ కేసుల వెనుక ఎవరున్నారో తేలే వరకు, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. తనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్లాన్ చేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎవరు అనుమతులు ఇచ్చారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై ఉన్న అక్రమ కేసులపై విచారణ జరిపించాలని కోరారు. డీజీపీకి అన్ని వివరాలు సమర్పించానని.. ఆయన సానుకూలంగా స్పందించారని నంద కుమార్ తెలిపారు.