CM Revanth : ఇవాళ వరంగల్‌‌కు సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదీ

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌‌లో పర్యటించనున్నారు. 

  • Written By:
  • Updated On - June 29, 2024 / 07:32 AM IST

CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌‌లో పర్యటించనున్నారు.  ఈసందర్భంగా వరంగల్ టెక్స్‌టైల్స్ పార్క్, నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన సందర్శిస్తారు. హనుమకొండ IDOC వద్ద మహిళా శక్తి క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)కు సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం సమీక్షిస్తారు. ఇవాళ సాయంత్రం హనుమకొండలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి సీఎం రేవంత్ శుక్రవారం రోజే వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున.. వరంగల్ పర్యటన శనివారానికి వాయిదా పడింది.  సీఎంవో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వరంగల్‌లో సీఎం రేవంత్(CM Revanth) పర్యటన ఇలా సాగుతుంది.

  • సీఎం రేవంత్ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకోనున్నారు. 1.30 నుంచి 1.50 గంటల వరకు ఆయన టెక్స్‌టైల్‌ పార్క్‌‌ను సందర్శిస్తారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి, ఫొటో ఎగ్జిబిషన్‌‌ను తిలకిస్తారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.
  • అక్కడి నుంచి వరంగల్‌ నగరంలోని రంగంపేట వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించేందుకు సీఎం వెళ్తారు.
  • 2.10 నుంచి 2.30 గంటల వరకు ఆస్పత్రి సందర్శన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుంటారు.
  • 2.45 నుంచి 3.00 గంటల మధ్య హనుమకొండ కలెక్టరేట్‌లోని మహిళా శక్తి క్యాంటీన్‌‌ను రేవంత్ ప్రారంభిస్తారు.

Also Read :Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. 88 ఏళ్ల రికార్డు బద్దలు

  • అనంతరం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి కార్యకలాపాలు, సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామునూరు ఎయిర్‌పోర్టు, వరంగల్‌ నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు.
  • సాయంత్రం 5.40 నుంచి 6.10 వరకు హంటర్‌ రోడ్డులోని మెడికవర్‌ ఆస్పత్రిని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు.
  • సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి 6.30 గంటలకు హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
  • సాయంత్రం 6.10 గంటల తరువాత వాతావరణ అనుకూలతను బట్టి రేవంత్‌రెడ్డి వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌లో లేదా  రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Also Read :Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత