Herald Case:`హెరాల్డ్ కేసు` ఢిల్లీ టూ తెలంగాణ ఇలా.!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తెలంగాణకు తాకింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో టీకాంగ్‌ నేతకు నోటీసులు జారీచేసింది ఈడీ.

  • Written By:
  • Updated On - September 23, 2022 / 04:07 PM IST

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తెలంగాణకు తాకింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో టీకాంగ్‌ నేతకు నోటీసులు జారీచేసింది ఈడీ. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి రేణుకాచౌదరికి సైతం నోటీసులు పంపించారని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం ఐదుగురికి ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే నేతలు మాట్లాడుతూ.. ఇంకా తమకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అక్టోబర్‌ 10న డిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సోనియా, రాహుల్‌ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్‌ గాంధీని సుదీర్ఘంగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది.. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది.. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధాలు రావడంతో.. మూడో రౌండ్ విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆరు గంటల పాటు సోనియాను ప్రశ్నించగా, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్.. ఢిల్లీ, ఇతర చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయ తెలిసిందే.. నిరసన తెలిపినందుకు రాహుల్ గాంధీ సహా వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అగ్రనేతలను అదుపులోకి అరెస్ట్‌ చేశారు పోలీసులు.. కానీ తర్వాత అందరినీ విడుదల చేశారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ జూన్‌ 21 నాలుగోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్‌ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్‌.. జూన్‌ 21న ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్‌ చేరుకున్నారు. విచారణ అనంతరం అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే ఆయన ఇంటికి తిరిగివెళ్లారు. దీంతో మొత్తం 40 గంటలకు పైగా ఆయన విచారణను ఎదుర్కొన్నారు. జూన్‌ 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్క రోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియాగాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో వాయిదా వేసింది. అయితే.. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవడం తెలిసిందే.

యంగ్‌ ఇండియన్, ఏజేఎల్, నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాల్లో రాహుల్‌ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్‌ గాంధీని, ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. సోనియా గాంధీని మూడరోజులపాటు మూడు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించింది. అయితే.. ఈ కేసులో ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టేనని , విచారణ ముగించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తదుపరి స్టెప్‌ ఎలా ఉంటుంది..? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పై దృష్టి సారించడం పై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ముగ్గురు మాజీ మంత్రులపై ఈడీ నోటోసులు పంపడంపై చర్యకు దారితీస్తోంది.