Telangana Tourists: కాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల (Telangana Tourists) కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసి, వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకారం.. తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలను వెంటనే అందించాలని మంత్రి తెలంగాణలోని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరారు. ఇది పర్యాటకుల స్థితిగతులను గుర్తించి, సకాలంలో సహాయం అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సుమారు 80 మంది తెలంగాణ పర్యాటకులు శ్రీనగర్‌లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిలో హైదరాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల వారు ఉన్నారు.
Also Read: Cucumber: ఎండాకాలంలో ఆరోగ్యంగా, కూల్ గా ఉండాలి అంటే.. ఈ కూరగాయ తప్పనిసరిగా తినాల్సిందే!
తెలంగాణ పర్యాటక శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను (9440816071, 9010659333, 040-23450368) ప్రకటించింది. ఈ నంబర్ల ద్వారా పర్యాటకులు లేదా వారి బంధువులు సమాచారం అందించవచ్చు లేదా సహాయం కోరవచ్చు. అదనంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ నోడల్ అధికారి వందన (9871999044), హైదర్ అలీ నక్వీ (9971387500)లను కూడా సంప్రదించవచ్చు. ప్రభుత్వం, భారత సైన్యం, విమానయాన సంస్థల సహకారంతో రైలు, విమాన సర్వీసులను పెంచి, పర్యాటకుల తరలింపుకు చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు భయపడాల్సిన అవసరం లేదని, వారి భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు