Site icon HashtagU Telugu

Sankranti: పల్లె పిలుస్తోంది.. పట్టణం కదులుతోంది!

Tollgates

Tollgates

సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటేనే పట్టణాలన్నీ సొంతూళ్ల బాట పడుతున్నాయి. పండుగను ఇంకొద్ది రోజులు సమయం ఉండటంతో పట్టణాల్లో ఉండేవాళ్లంతా ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద వాహనాలన్నీ బారులు తీరి కనిపిస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో చాలామంది ఎక్కువగా సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. రేపు ఆదివారం ఉండటంతో శనివారం నుంచే ప్రయాణాల సందడి మొదలైంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో పండుగల కోసం ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు రద్దీగా ఉండడంతో చిట్యాల సమీపంలో హైవేపై వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లలో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉప్పల్, ఎల్‌బీ నగర్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి రీజియన్‌లలో ప్రైవేట్ బస్సులు కూడా నిలిచిపోయాయి.

పండుగ సందర్భంగా రద్దీని తీర్చడానికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా రాష్ట్రంలోని జిల్లాల వైపు 3,338 బస్సులు, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు 984 బస్సులతో సహా 4,322 ప్రత్యేక బస్సులను మోహరించింది. ప్రయాణికుల నుంచి 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే జనవరి 7 నుంచి జనవరి 15 వరకు బస్సులు తిరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ వైపు విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు, పోలవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, చిత్తూరు, కడప, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు లాంటి పట్టణాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి.