Site icon HashtagU Telugu

Telangana Heavy Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు

Tg Rains

Tg Rains

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు సంభవించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఎన్ని ప్రయోజనాలు !!

వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రేపు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఎన్ని ప్రయోజనాలు !!

ఇవే కాకుండా.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, జగిత్యాల, జనగాం, కరీంనగర్ వంటి ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చని, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.